Sucide is correct or not ? ఆత్మ హత్య ఒక అనాలోచిత చర్య
* ఆత్మహత్య ఒక అనాలోచిత చర్య* ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? ఎందుకు ఆ ఆలోచనలు మనసులోకి వస్తాయి ? దానికి గల కారణం ఏమిటి? మనిషి కి మాత్రమే వచ్చే ఆలోచన ఇది..ప్రపంచంలో ఆత్మహత్య చేసుకుకునే ప్రాణి వేరే ఏది లేదు...చాలా మందికి ఈ ఆలోచన కలగడానికి ఎన్నో రకాలైన కారణాలు ఉండవచ్చు కానీ ఆ కారణం కి అకాలమరణమే పరిష్కారమా? మీకు తెలుసా ఆ ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన దాటిన నాడు మీ జీవిత పరమార్ధం మీకు తెలుస్తుంది. 1,తల్లిదండ్రులను కోల్పోవడం 2,ఆర్ధిక ఇబ్బందులు 3, ప్రేమించిన వారి తిరస్కరణ 4,మోసపూరిత మనుషుల వల్ల జరిగిన ప్రమాదాలు 5,లైంగిక వేధింపులు. 6,అంగవైకల్యం 7,చదువు నేర్చుకోలేకపోవడం 8,మానసిక అశాంతి 9,ఉద్యోగహీనత 10,శరీరం రోగగ్రస్తం అవడం. మొదలగునవి... ఈ కారణాలు అన్ని ఒక సమయం లో మనల్ని చావే పరిష్కారం అనేలా ప్రేరేపించవచ్చు కానీ మనం ఒకసారి మన తోటి వారిని ఆ సమయం లో పరిశీలనగా చూద్దాం... ఇరా సింఘాల్:- అంగవైకల్యం ఉన్నా "ఇరా సింఘాల్ " IAS సాధించి మన అందరికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రపంచం లో ఎంతో మంది ప్రపంచంలో ఒకరు గా కాకుండా ప్రపంచంలోనే ఒకరి గా ...