Sucide is correct or not ? ఆత్మ హత్య ఒక అనాలోచిత చర్య
* ఆత్మహత్య ఒక అనాలోచిత చర్య*
ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? ఎందుకు ఆ ఆలోచనలు మనసులోకి వస్తాయి ? దానికి గల కారణం ఏమిటి?
మనిషి కి మాత్రమే వచ్చే ఆలోచన ఇది..ప్రపంచంలో ఆత్మహత్య చేసుకుకునే ప్రాణి వేరే ఏది లేదు...చాలా మందికి ఈ ఆలోచన కలగడానికి ఎన్నో రకాలైన కారణాలు ఉండవచ్చు కానీ ఆ కారణం కి అకాలమరణమే పరిష్కారమా? మీకు తెలుసా ఆ ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన దాటిన నాడు మీ జీవిత పరమార్ధం మీకు తెలుస్తుంది.
1,తల్లిదండ్రులను కోల్పోవడం
2,ఆర్ధిక ఇబ్బందులు
3, ప్రేమించిన వారి తిరస్కరణ
4,మోసపూరిత మనుషుల వల్ల జరిగిన ప్రమాదాలు
5,లైంగిక వేధింపులు.
6,అంగవైకల్యం
7,చదువు నేర్చుకోలేకపోవడం
8,మానసిక అశాంతి
9,ఉద్యోగహీనత
10,శరీరం రోగగ్రస్తం అవడం.
మొదలగునవి...
ఈ కారణాలు అన్ని ఒక సమయం లో మనల్ని చావే పరిష్కారం అనేలా ప్రేరేపించవచ్చు కానీ మనం ఒకసారి మన తోటి వారిని ఆ సమయం లో పరిశీలనగా చూద్దాం...
ఇరా సింఘాల్:-
అంగవైకల్యం ఉన్నా "ఇరా సింఘాల్ " IAS సాధించి మన అందరికి స్ఫూర్తిగా నిలిచారు.
ప్రపంచం లో ఎంతో మంది ప్రపంచంలో ఒకరు గా కాకుండా ప్రపంచంలోనే ఒకరి గా గుర్తింపబడుతున్నారు.వారిలో ఎంతో మంది మనకు ఆదర్శం.
అరునిమా సిన్హా:-
రాత్రి సమయం లో అరునిమా సిన్హా రైలు లో ప్రయాణిస్తుండగా కొంతమంది తన దగ్గర ఉన్న బంగారం,డబ్బు తీసుకొని తర్వాత తనని రైలు నుండి తోసేసారు. రాత్రంతా తన ప్రక్కన ఎన్నో రైళ్లు ప్రయాణిస్తూ ఉన్నాయి.తెల్లవారుజామున ఆమెని గమనించిన కొందరు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ చేదు సంఘటన తర్వాత తను తన ఎడమ కాలిని కోల్పోయింది. తన కళ్లు వేరే వాళ్లు తన పై చూపించే జాలి ని చూస్తుంటే , తన చెవులు వేరేవారి నోటి నుండి వచ్చే అపవాదులను వింటున్నాయి…తను బలంగా కోరుకున్నది ఒక్కటే అది విజయం మరి అది ఎలాంటి విజయం ఎవరు చేయని ,ఇంతవరకు ఎవరు చూడని విజయం ఆ విజయం కోసం కష్టపడింది ,పోరాడింది చివరగా సాధించింది .ఆ విజయం ఏమిటో తెలుసా “ఒకే కాలు కలిగి ఎవరెస్టు అధిరోహించిన మొదటి మహిళ”.
అరునిమా సిన్హా విజయానికి ఒక క్రొత్త నిర్వచనం తీసుకువచ్చారు.
Wonderful meaning, Golden Words Madam, Srividya Muniganti
ReplyDeleteNice madam
ReplyDeleteKeep it up
Nice madam 👌
ReplyDelete