What is the role of parents in raising children?

 ప్రతి వ్యక్తి జీవితం లో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనది.

ఒక వ్యక్తి నీతి నిజాయితీ గా ,సరైన మార్గం లో బ్రతకాలి అంటే  వారికి ముందుగా వారు పెరిగే పరిస్థితులు సక్రమం గా ఉండాలి…ఒక తండ్రి కి కాల్ వస్తే తను వివిధ కారణాల వల్ల   తను ఇంట్లో ఉన్నా “మా నాన్న ఇంట్లో లేరు “ అని తన బిడ్డ తో సెల్ ఫోన్ లో చెప్పించే మాట విలువ ఏంటో తెలుసా?? నీ బిడ్డ కి అబద్దం చెప్పినా తప్పు లేదు అని నేర్పిస్తున్నావు…ఒక తల్లి  కూరగాయలు కొనేటపుడు ఆ వర్తకుడు 100 రూపాయలు లెక్కించడం లో చేసిన తప్పు వలన ఎక్కువ డబ్బు ఇస్తే నీవు తెలిసి కూడా నీ  బిడ్డ ముందు ఆ డబ్భు తీసుకున్నావు అంటే….దాని అర్ధం నీ బిడ్డ కి ఏమి నేర్పించావో తెలుసా ???దొంగతనం చేసిన తప్పు లేదు అని నేర్పించావు..నీ బిడ్డ ముందు భార్యాభర్తలు గా మీరు గొడవ పడుతున్నారంటే అర్ధం ఏంటో తెలుసా నీ బిడ్డ కి మానసిక అశాంతి ని కలిగిస్తున్నవని అలాగే నీ బిడ్డ కి చదువు నేర్చుకోకుండా అడ్డుకుంటున్నావని అర్ధం…నీ బిడ్డ ముందు మద్యం తాగుతున్నావంటే ,సిగరెట్ కాలుస్తున్నావంటే అర్ధం ఏంటో తెలుసా నీ బిడ్డ కి చెడు వ్యసనాలు దగ్గరుండి మరి నేర్పిస్తున్నవాని అర్ధం…

       నీ బిడ్డ ముందు నీ భార్యని తక్కువ చేసి మాట్లాడి ,దూషించావంటే అర్ధం ఏంటో తెలుసా నీ బిడ్డకి ఆడవారు అంటే గౌరవించకూడదు అనే విధానం నేర్పిస్తున్నావు…నీ బిడ్డ తప్పు చేసినా నా బిడ్డ ఏమి చేసినా కరెక్ట్ గానే చేస్తాడు అని సమర్ధించావు చూసావా????? హ్మ్ ఏమి నేర్పించావు నీ బిడ్డకి తప్పు చేసినా నా వాళ్ళు కాపాడతారు అని నేర్పించావు…నీ బిడ్డ ముందు తోటి వారితో దెబ్బలాడావు చూసావా ఏమీ నేర్పించావని అనుకుంటున్నావు నీ బిడ్డ కి ????  ఒకరి రక్తం కళ్ళ చూసిన తప్పు లేదు.అని నేర్పించావు….నీ బిడ్డ ముందు నీవు మరొక స్త్రీ తో తప్పుగా ప్రవర్తించవా??? నీ బిడ్డ కి ఏమి నేర్పించావని అనుకుంటున్నావు?????? నీవే నీ బిడ్డ పతనానికి నాంది పలికావు.. నీవే నీ ప్రవర్తనతో నీ బిడ్డ జీవితాన్ని కాలరాసావు ,నీవే నీ  చేతులారా నీ బిడ్డ తల రాతను మార్చావు.. నీవే నీ బిడ్డ కి మరణ  మృదంగం మోగించావు…….అర్ధం చేసుకో ఏమి నేర్పిస్తున్నావో ..



గడిచిపోయిన కాలాన్ని తిరిగి మార్చలేము కానీ ఈ గడుస్తున్న కాలాన్ని అయినా మనం మారుద్దాం. ఒక తల్లిదండ్రులు గా మన పిల్లలకు మనం నేర్పించుకుందాం .ఎలా బ్రతకాలి ,ఏది ఉన్నతమైనది,ఏది తృణమైనది, వేటిని వదిలేయాలి ,వేటిని స్వీకరించాలి,జీవితం లో ఏమి పొందాము, జీవితంలో నీ లక్ష్యాన్ని చేరుకున్నపుడు నీ మోము లో కలిగిన చిరు నవ్వును నువ్వు  అనుభూతి పొందావా??? నీ లక్ష్యం తరువాత నీవు ఒదిగి ఉన్నవా?  చివరగా నీ విజయపు గుర్తులు ఈ భూమి పై వదిలి వెళ్ళవా?

మనం చేయాల్సింది మనం సక్రమంగా ఉండడం మాత్రమే.నీవు నీకై చేసుకునే మంచి ,సమాజం లో మార్పు కి తోడ్పడుతుంది.. పక్క వారు రోడ్ పైన రాంగ్ రూట్ లో వెళ్తుంటే నీవు,వారికి సరైన సలహాలు ఇవ్వకపోయినా పర్వాలేదు…కానీ నువ్వు రాంగ్ రూట్ లో వెళ్లే వాళ్ళని అనుసరించకు…తర్వాత నిన్ను చూసి ఒక్కరు అయిన సరైన విధానం గా మారినా సమాజ నిర్మాణం లో నీవు ఒక అడుగు ముందుకు వేసినట్లే…..

" ఒక అందమైన అడవి ని కార్చిచ్చు దహిస్తుందంటే తప్పు పిడుగుది

ఒక గల గల పారే సెలయేరు  జల ప్రళయం ని కలిగిస్తుందంటే ఆ తప్పు వరుణుడిది

సకల ప్రాణులను కలిగిన భూమి భూకంపం ని సృష్టింస్తుందంటే ఆ తప్పు  భూగర్భశిల కదలికది.

 అలాగే 

ఒక వ్యక్తి తప్పు దారిని ఎంచుకున్నాడంటే తప్పు తన తల్లిదoద్రులదే "

పిడుగులు ఉద్రేకాన్ని కోల్పోయినపుడు, వరుణుడు దయ చూపినపుడు,భూగర్భశిల శాంతించినపుడు,

కాలక్రమేణా  అన్ని కొత్త గా మారుతాయి మార్పు సహజం. తిరిగి అడవిలో చెట్లు చిగురిస్తాయి,సెలయేరు నాట్యమాడుతుంది మరియు భూమి ఈ సారి ఆధునికంగా మారుతుంది.

అలాగే తల్లిదండ్రులు గా బాధ్యతలు నిర్వర్తించే మనం అనాలోచిత ,వ్యర్ధమైన విషయాలను వదిలివేస్తే  మన పిల్లల భవిష్యత్తు అలాగే సమాజం ,తరతరాలు నిశ్చింతగా  సక్రమంగా ముందుకు సాగుతాయి….

                                    

                                                    మార్పును ఆశిస్తూ

                                            ✍️మీ శ్రీవిద్య మునిగంటి..


Comments

Post a Comment

Popular posts from this blog

Who are you ? నీవు ఎవరు?

Sucide is correct or not ? ఆత్మ హత్య ఒక అనాలోచిత చర్య