Who are you ? నీవు ఎవరు?

Who are you?





ఈ ప్రపంచం లో ఉన్న ప్రతి ప్రాణి కి ఒక ప్రవర్తన ఉంటుంది.ఆ ప్రవర్తన తన పుట్టిన పరిసరాల వల్ల వచ్చి ఉండవచ్చు,జన్యు పరంగా ఉండవచ్చు లేక తనతో మెలిగే వారి వల్ల అయిన వచ్చి ఉండవచ్చు…ఈ ప్రవర్తన లో చాలా రకాలు ఉన్నాయి. కొందరి ప్రవర్తన మనసుకు సంతోషాన్ని కలిగిస్తే ,కొందరి ప్రవర్తన బాధని,మరికొందరి ప్రవర్తన ఉద్రేకాన్ని కొన్ని సమయాలలో ఎదుటి వ్యక్తి ప్రవర్తన తనకి తానుగా ఈ లోకాన్ని వదిలివేయడమే మంచిది అని భావించేలా ఉంటుంది…కానీ విజ్ఞత కలిగిన వారు ఇలాంటి ఆలోచనలు తన మనసులోకి చేరినా కూడా తమ బాధ్యతల నిర్వహణ కోసం అలాంటి ఆలోచనలను విస్మరిస్తారు…ప్రపంచం లో ప్రాణులు ఎల్లవేళలా సంతోషాలని కలిగి లేవు అదే విధంగా దుఃఖాలను కలిగి లేవు.జీవితం ఒక బొమ్మ బొరుసు ఆటలాంటిది. మనం ప్రతి విషయం లో ఓర్పు వహించాలి…ఓర్పు కి అర్ధం ఓడిపోవడం కాదు…ప్రతిదీ క్షుణ్ణంగా విశ్లేషించడం .ఆ విషయం ఓర్పు ఉన్న వారికి మాత్రమే తెలుసు…

నేను కొన్ని సార్లు గమనించిన విషయం ఏమిటంటే కొంతమంది తన స్నేహితులను కానీ,ఆప్తులను కానీ  ఊబి నుండి బయట కి లాగి అక్కున చేర్చుకున్నట్లు గా చాలా ఆప్యాయతను నటిస్తారు కానీ ఆ స్నేహితులను,ఆప్తులను ఆ ఊబి లోకి నెట్టేసేదే ఆ నటించే మనుషులు.

జీవితం లో  మనకు అబద్ధాలు చెప్పే వారు ,అల్ప మనస్కులు,అవసరం తీరు గా మాట మార్చే వారు,అజమాయిషీ చూపించే వారు,కల్మషం కలవారు, మోసపూరిత మైన మనుషులు, ఏ సమయం లో ఏమి మాట్లాడాలో తెలియని వారు,మాట విలువ తెలియని వారు,ధనమే ముఖ్యం గా బ్రతికేవారు,తన దగ్గర పని చేసే వారి శ్రమని గుర్తించని వారు, తోటి వారికి గౌరవం ఇవ్వని వారు,ఒకరిని బాధపెట్టి వారు సంతోషం గా ఉండేవారు,అసమానత్వా ధోరణి కలవారు,వ్యక్తి శ్రమని దోచుకునే వారు,ఒకరి స్వార్జితము ను ఆశించేవారు మొదలగు రకములైన మనుషులను మనం మన జీవితం లో చూసి ఉంటాము.కాబట్టి మనలో ఒక విరక్తి ,అసహనం ,కోపం ,మానసిక వేదన సహజం.…

అదేవిధంగా ఒక పసిబిడ్డ నవ్వు, ఆత్మీయుల పలకరింపు , .ఉదయపు సూర్య బింబం  ,స్వచ్చమైన పవనాలు,అందమైన పువ్వులు,అమాయక మూగ జీవలు, సముద్రపు అలలు,మనలో జీవాన్ని నింపే ఒక పుస్తకం, మన అమ్మ ఒడి,మన స్నేహితుల కరచాలనం,ఒక గురువు నోటి నుండి జాలువారే అద్భుతమైన మాట  ఇవన్ని మనల్ని మనోస్థైర్యం తో ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తాయి.

మనం మన పరిసరాలను గమనిస్తే విభిన్న మైన పరిస్థితులు తారసపడతాయి…ప్రతి రోజూ ఒక అద్భుతమైనది..మరి అది అద్భుతంగా ఉండాలా? ఆవేదనతో నిండి ఉండాలా? అనేది నీ చేతిలోనే ఉంది. నీవు ఏది కోరుకుంటావో నీకు అదే దొరుకుతుంది… నీవు ఆనందం కోరుకుంటే అది నీ పెదవి చివరన దొరుకుతుంది.మరి నీవు బాధని కోరుకుంటే ఆది నీ కంటి చివరన సంద్రమై ప్రవహిస్తుంది.


 ఉన్న ఒక్క జీవితం ఒకరి చేతిలో పెట్టకు…నీ జీవితం నీచేతి లో దాచుకో,నీకు నచ్చినట్లు మలుచుకో,నిన్ను బాధపెట్టిన వాళ్ళ కోసం ఆలోచించకు ,నీకు తోడు గా లేని వాళ్ళ కోసం పరితపించకు, అందరూ నీ వాళ్లే అనుకోకు,నిన్ను నమ్మిన వాళ్ళని వదులుకోకు, బాధ్యతలు ఉంటే వాటిని నిర్వర్తించు, నీ బలహీనతని బలం గా మార్చుకో,కాలం వృధా చేయకు ,నీ కాలంని ఎవరికి ఇవ్వకు, ఎవ్వరు ఉన్నా లేక పోయినా ఏకాకి గా అయిన బ్రతుకు కానీ బ్రతుకు…

కాల గమనం లో శాంతిగా ఉన్నవారుఉన్నారు ,కోపం తో రగిలిపోయే వారు ఉన్నారు…మనకి ఎందుకు ఉద్రేకం? ఏదైన మనది అనుకున్నప్పుడు అది దొరకనప్పుడు మనకి ఆక్రోషం ,అసహనం మరి మనది కాదు అని వదిలేస్తే మనసుకి సాంత్వన,సంతోషం…ఎగిసే అలని ఎలాగైతే పట్టుకోలేమో మనల్ని వదిలి వెళ్లే వాటిని కూడా ఆపలేము...మన జీవితం లో ఉన్న వాటికి ప్రాధాన్యం ఇవ్వు…వెళ్లే వాటికి దారి ని ఇవ్వు.

 ఈ ప్రపంచం లోకి నీవు ఒంటరిగా పోరాడటానికి వచ్చావు అనే విషయం ఎప్పుడు మర్చిపోకు.నీవు బలవంతుడివా లేక బలహీనుడివా అనేది నీ చేతిలోనే ఉంది.


ఇప్పుడు చెప్పు  నీవు ఎవరు?


 నీవు ఏది కోరుకుంటావో నీకు అదే దొరుకుతుంది… 

నీవు ఆనందం కోరుకుంటే అది నీ పెదవి చివరన 

దొరుకుతుంది.

మరి

 నీవు బాధని కోరుకుంటే ఆది నీ కంటి చివరన సంద్రమై

 ప్రవహిస్తుంది.

                                           ✍️ మీ శ్రీవిద్య మునిగంటి


Comments

Post a Comment

Popular posts from this blog

Sucide is correct or not ? ఆత్మ హత్య ఒక అనాలోచిత చర్య

What is the role of parents in raising children?